బాత్రూంలో కండోమ్స్, క్లాస్‌లో ఆ పాఠాలు, అమ్మాయిలు ముందు వరుసలో | Oneindia Telugu

2017-11-07 3

A group of students and research scholars of Andhra University targeted the head of the Sanskrit department, Prof K Yedukondalu, here on Monday, charging him with harassing girl students. Based on a complaint, the III Town police registered a case against the professor.

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అమ్మాయిలపై ప్రొఫెసర్ వేధింపుల పర్వం వెలుగు చూసింది. ప్రొఫెసర్లపై ఫిర్యాదు చేస్తే తమ భవిష్యత్తు దెబ్బతింటుందన్న భయంతో చాలామంది మౌనంగా భరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టిన ఘటనలు ఉన్నాయి.
తాజాగా సంస్కృత విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఏడుకొండలుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయనపై గతంలోను ఈ ఆరోపణలు వచ్చాయి. వీటిపై వర్సిటీ కమిటీ వేసి విచారించింది. అనంతరం న్యాయమూర్తులతోను విచారణ చేయించారు.ఏయూ రెక్టార్‌ ప్రొఫెసర్ గాయత్రీదేవి కూడా గతంలో ఏడుకొండలు కారణంగా ఇబ్బందులు పడ్డారు. ఆమె కోర్టును ఆశ్రయించారు. తనను క్షమించమని ఏడుకొండలు లిఖితపూర్వకంగా కోరడంతో ఆమె తన కేసును ఉపసంహరించుకున్నారు.